భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
గుడిలో
  • జయ హో పరమేశ్వరా, జయ హో గోల్జ్యూ నీకు.
    జై హో పరమేశ్వరా, జై హో గోలజ్యూ తుమారి.
  • పంతులుగారూ నమస్కారం.
    పండిత్ జ్యూ పైలాగ్.
  • ఆశీర్వాదం బాబూ. ఎక్కడినుంచొచ్చారు?
    ఆశీర్వాద్ జజమాన్. కా బటి ఆఛా?
  • పంతులుగారూ మేము ఇక్కడే అల్మోరా నుంచి వచ్చాం.
    పండిత్ జ్యూ హమ్ త యె అల్మాడ్ బటి ఏ రయా.
  • అల్మోరాలో ఎక్కడుంటారు?
    కో జాగ్ రూఛా అల్మాడ్ మే?
  • మేము అల్మోరాలో జాఖనదేవీలో ఉంటాం
    హమ్ త జాఖనదేవి మె రూనూ అల్మాడ్ మే.
  • అక్కడేం చేస్తారు?
    కే కరఛా వా?
  • నేను విద్యుత్ శాఖలో ఉన్నాను. ఎన్ని రోజులు రావాలని అనుకున్నా ఈరోజు చాలా కష్టపడి ప్రోగ్రాం కుదిరింది.
    బిజిలీ విభాగ్ మె ఝు. కతు దిన్ బటి ఊణై సోచ్నణౌ ఛయా ఆజ్ బడ సాకౌ ప్రోగ్రామ్ ధో ధో.
  • వచ్చి మంచి పని చేసావు, ఎలాగైనా, భగవంతుని ఆజ్ఞ ఉన్నప్పుడే, మనిషి చేరుకోగలుగుతాడు.
    భల్ కరౌ ఏగోఛా, ఉసిక్ లై జబ్ ఇష్టౌక్ హుకుం హూ తబై ఆదమీ పహుంచ్ సకతా హై.
  • పంతులుగారూ మరి మీరు పూజ చేస్తారా, మేము ఇంటి నుండి కొన్ని వస్తువులు తెచ్చాము. ఏదైనా ఎక్కువ తక్కువలుంటే మీరే చెప్పండి.
    పండిత్ జ్యూ పై అపున్ పూజ కరై దేలా, కుచ్ సామాన్ త హమ్ ఘరై బాయి లై రయాన్. జే కమీబేసి ఛ అపూ బతై దియౌ.
  • సరే సరే, నాకు వస్తువులు చూపించు, మీరు ఏమి తెచ్చారు. మీరు అన్ని సామాన్లు తెచ్చారు. బయటి దుకాణం నుండి గంట ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకురండి. అంతే ఇక పూజలు ప్రారంభిద్దాం. వెళ్లి సరుకులు తీసుకురండి.
    హోయ హోయ, దేఖౌ ధన్ సమాన్ మకాన్, కే కే లై రౌఛా. ఏక్ ఘంట్ భయ్ ఔర్ ఏక్ నారియల్ భయ్ లియావు భైర్ దుకాన్ బాటి. బస్ ఫిర్ షురూ కర్ దినూ పూన్. జావో తుమ్ లియావౌ సమాన్.
  • తీసుకోండి పంతులుగారూ గంటా కొబ్బరికాయ తెచ్చాను. ఇంకేమీ అక్కర్లేదా?
    లియౌ పండిత్ జ్యూ ఏక్ ఘాంట్ ఔర్ ఏక్ నారియల్ భై లి ఏయూ మై. ఔర్ త కె ని చైన్?
  • లేదు, లేదు, ఇంకేమీ అవసరం లేదు. ఏమైనా ఎక్కువతక్కువలుంటే ఇక్కడి నుంచే పూర్తి చేస్తాను. మీరు ఇప్పుడు మీరు చేతులు ముఖం కడుక్కుని రండి.
    నై నై ఔర్ కే నీ చైన్. బాకీ జే కమీబేసి హోలీ మే పూర్ కరి దియున్ యా బటి. తుమ్ హాతమూఖ ధ్వే ఆవౌ పై.
  • పంతులుగారూ పూజ మాత్రం సరిగ్గా చేయండి. మేము తొందరపడటం లేదు హాయిగా పూర్తి చేయండి.
    పండిత్ జ్యు పుజ మాతరై భలికై కరై దియా. హమనకం జల్దీ న్హా. ఆరామైల్ కరావౌ.
  • అలాగే. మీరు మీ భార్యతో కలిసి ఇటువైపు కూర్చోండి. పిల్లలను ఇటువైపు కూర్చోబెట్టండి. నీళ్ళు చేతిలోకి తీసుకోండి.
    ఠీక్ ఛ. భైటౌ తుమ్ ఇతర్బై అప్ణి సేణీ దగాడ్. నానతినన్ కం యో సైడ్ మె భైటై దియో. హాత్ మె జల్ లియౌ.
  • సంకల్పం చెప్పండి. ఓం.........................
    సంకల్పకరౌ. ఓం......................................
  • రండి, పూజ ముగిసింది, ఇప్పుడు మీరు నమస్కరించి, చేతులు జోడించి మూడుసార్లు ప్రదక్షణ చేయండి.
    చలో పుజ సంపన్న హైగె అబ్ తుమ్ ప్రణామ్ కర బేర్ తీన్ బార్ పరిక్రమా కర లియౌ హాత్ జోడ్ బేర్.
  • ప్రదక్షిణ పూర్తయింది. ఇప్పుడు తీర్ధం తీసుకోండి ఇంకా పిల్లల్ని కూడా పిలవండి.
    హైగె పరిక్రమా పురి. అబ్ చరణామిర్త్ లియౌ ఔర్ నానతినన కం లై బులావౌ.
  • ఇదిగో చూడండి బాబూ, పూజ పూర్తయింది. ఈ సంచిలో ప్రసాదం అలాగే దీవెనలు ఉంచాను. ఇప్పుడు ఈ గంటను గుడిలో ఎక్కడైనా కట్టండి. దేవుడా, వారికి మేలు చేకూరుగాక. కుటుంబంలో సంపద, ఆనందం మరియు శాంతి వెల్లివిరియుగాక. నీ దయవల్ల వీరి పూజ పూర్తయింది. దేవుడికి నమస్కారం జై హో గోల్ జీ.
    లియౌ జజ్మాన్, పూజపతి హైగో సంపన్న్. యో థైలీం మై పరసాద్ భయీ ఆసీక్ భయీ ధరి హైలీ. తౌ ఘాంట్ కం అబ్ కల్లైయి బాది దియో మందిర్ మె కే. జై హో ఇష్ట ఇనౌర్ భల్ కరియా. పరివార్ మె ధనధాన్య్, సుఖ్ శాన్తి బణై రాఖ్యా. తుమ్రీ కిర్పాల్ ఇన్రి పూజపతి సంపన్న్ హైగే. జై హో భగవాన్. జై హో గోల్ జ్యూ.
  • పంతులుగారూ, ఇప్పుడు పూజ మీ దయతో పూర్తయింది. మా నుండి ఈ చిన్న దక్షిణను స్వీకరించండి, అది ఎంత చిన్నదైనా సరే. ప్రస్తుతం చెయ్యి కాస్త టైట్ గా ఉంది. ఇంకోసారి ఎప్పుడేనా మళ్ళీ వచ్చినప్పుడు మీకు చక్కటి సేవ చేసుకుంటాం. బాధపడకండి. మా సంగతి ఏమైనా పదే పదే పని పూర్తిచేయించేవారు మాత్రం మీరే.
    పండిట్ జీ అబ్ అపూన్ కిర్పాల్ పూజ్ త హైగే. హమ్ లోగ్ నైన్ తర్బై నానినాని దక్షిణా స్వీకార్ కరో థోడి భౌత్ జతుక్ లే ఛ. ఐల్ జరా హాత్ టైట్ చల్ రౌ. ఫిర్ జబ్ కభౌ ఊన్ తబ్ తుమరి భలీకై సేవా కరి జాలి. నక జన మానియా. హమారా త జస్ లై భయా అపుయీ భయా టైమ్ బే టైమ్ కామ్ చలుణీ.
  • మీరు ఏది ఇస్తే, నేను అది తీసుకుంటాను. అలంటి పట్టింపేమీ లేదు. డబ్బే అంతా కాదు కదా ప్రేమే అతి పెద్ద విషయం. మీరు ఇంత నమ్మకంతో నా దగ్గరకు వస్తారు, ఇక్కడ అలాంటివేమీ జరగవు. మీరు మా రోజువారీవారు అయ్యారు. మీకు మంచి జరగాలి అంతే. అందరికి ఇచ్చే దేవుడు ఈయనే, మాకు కూడా ఆయనే దిక్కు. మేము వారి సేవకులమయ్యాము.
    అరే జజ్మాన్ జే ది దెలా యు లి ల్యూన్. తస్ కె ఫికర్ ని కరౌ. డబ్లై జై కే హున్ సబ్, ఆద్మీ ప్యార్ సబన్ హై ఠులీ చీజ్ ఛ్. తుమ్ ఇతు బ్రోసైల్ ఉంచా మ్యర్ పాస్, తస్ కే ని భయ్ యాన్. తుమ్ హమారా రోజైకా భయా. బస్ తుమర్ భల్ హైయీ ఛై. సబన్ కం దిణి వాల్ యోయి పరమేశ్వర్ ఛన్, ఇన్రై ఆసౌర్ హమనకం లై ఛ. హమ్ త ఇనార్ సేవక్ భయా.
  • ఈసారికి వెళ్ళొస్తాం పంతులుగారూ. మళ్లీ ఎప్పుడో దర్శనం చేసుకుంటాం. ఇక్కడికి వస్తూనే ఉంటాం.
    హిట్నుమ్ పై ఏల్ పండిత్ జ్యూ. ఫిర్ కభణి దర్శన్ కరూన్ హమ్ త ఊనై రూనూ యా.
  • సరే సరే తప్పకుండా. మళ్ళీ రండి ఆశీర్వాదం.
    హోయ్ హోయ్ కిలై నై। ఆయా ఫిర్ ఆయా. ఆశీర్వాద్.